కాకతీయుల పతనం తరువాత క్రీ.పూ 1324 నుండి 1434 వరకు పాలనలో తెలుగు భాషా సంస్కృతులకు అపారమైన సేవ చేసిన రెడ్డి రాజుల రాజ్యస్థాపకుడు ప్రోలయవేమారెడ్డి. రెడ్డి రాజులు తాము గెలిచిన ప్రాంతాలను అంతటిని, పూర్వరాజుల దానాలను స్థిరపరిచి పైగా అసంఖ్యాక భూములు అగ్రహారాలను బ్రాహ్మణులకు దారాళంగా దానం ఇచ్చారు. ఈ ఖ్యాతిని విని ఎందరో బ్రాహ్మణులు కోకొల్లలుగా చేరారని, చరిత్రకారుడు, ప్రభంద పరమేశ్వర బిరుదాంకితుడు ఎర్రాప్రగడ తన హరివంశంలో రెడ్డి రాజుల ఖ్యాతిని కీర్తించి, వేమారెడ్డికి అంకితమిచ్చాడు.

రెడ్డి రాజ్యం పశ్చిమాన శ్రీశైలం, అహెూబిలం నుండి తూర్పున బంగాళాఖాతం దాకా, దక్షిణాన కందుకూరు నుండి ఉత్తరాన కృష్ణానది వరకు విస్తరించి ఉంది. రెడ్డి రాజుల కాలంలోనే రాజ్యమును పరిపాలన సౌలభ్యం కోసం "సీమలు "లు గా విభజించారు. గౌతమీనదికి ఇరుపక్కలా కోనసీమ, అంగరసీమ, చాగలునాటి సీమ.మొదలైన సీమలున్నాయి.

ఈ కాలంలోనే అరటి, కొబ్బరి, పనస, పోక, మామిడిని ನಿಮ್ಮಿದ್ಧಿಗ್ పండించారు. రెడ్డి రాజులకాలంలో కళలు కావ్యాలై అలరారాయి. శ్రీశైలం - అహెూబిలం లాంటి దేవాలయాలలో భక్తుల సౌకర్యార్థం మెట్ల నిర్మించారు. రెడ్డి రాజుల కాలంలో భాషా - సాంప్రదాయాలకు అపార సేవలు చేశారని శాసనాధారాలు కలవు.

బాల సరస్వతి - అనపోతారెడ్డి ఆస్థానకవిగా, త్రిలోచనాచార్యుడు అనవేమారెడ్డి ఆస్థానకవిగా సాహిత్యసేవలో తరించారు. రెడ్డి రాజుల ఆశ్రయంలో ఎర్రాప్రగడ, శ్రీనాధుడు, వెన్నెలకంటి సూరన, నిశ్శంక కొమ్మన అను ప్రముఖులెందరో కలరు. ఇదేగాక రెడ్డి రాజులు స్వయంగా సాహిత్యపరిమళాలల సుగంధము తెలిసిన సాహిత్యకారులు. కుమారగిరి రెడ్డి వసంతరాజీయమనే నాట్యశాస్తమునూ, పెదకోమటి వేమారెడ్డి సాహిత్య చింతామణి అను గ్రంధాలను వ్రాసారు. గీర్వాణంలో వ్యాఖ్యలు - కవితలనూ వ్రాసిరి. రెడ్ల ఆస్థాన కవులుగా స్థిరపడినవారు – ఆశ్రయించిన వారికి ఏ విధమైన భాషా సాంస్కతికి ఆంధ్రకవి పండితులే కాక అనేక పండితులు, కవులు, కళావేత్తలు రాజాశ్రయం పొందారు. వీరందరి సామర్గ్యాన్ని పరిక్షించుటకు శ్రీనాధకవిసార్వభౌముడిని విద్యాధికారిగా నియమించారు.

రెడ్డి రాజులకు ముందుచూపు ఎక్కువ, వినుకొండ, కొండవీడు, ధాన్యకటకం లాంటి 84 దుర్గాలనూ నిర్మించి శాంతిభద్రతల దృష్ట్యా సైన్యాన్ని నియమించి కరోరపరిస్థితుల నుండి ప్రజలను సొంతబిడ్డల్లా కాపాడుకోగల ప్రజారంజక పరిపాలన సాగించారు.

రెడ్డి రాజుల చరిత్ర

రెడ్డిలు ముసునూరి నాయకులు సేనాధిపతులుగా పేరుప్రఖ్యాతులుగాంచిరి ప్రధానంగా కొండవీడుని, రాజధాని చేసుకుని తీరాంధ్ర పరిపాలించారు. రెడ్డి రాజ్యస్థాపకుడు ప్రోలయవేమారెడ్డి

కొండవీటి రెడ్డిలు

  • ప్రోలయ వేమారెడ్డి 1325 నుంచి 1353 వరకు
  • అనపోతారెడ్డి 1353 నుంచి 1364 వరకు
  • అనవేమారెడ్డి 1364 నుంచి 1386 వరకు
  • కుమార గిరిరెడ్డి 1386 నుంచి 1402 వరకు
  • పెదకోమటి వేమారెడ్డి 1402 నుంచి 1420 వరకు
  • రాచవేమారెడ్డి 1420 నుంచి 1424 వరకు

రెడ్డిల రచనలు, బిరుదులు

సర్వజ్ఞచక్రవర్తి బిరుదుగల పెదకోమటి వేమారెడ్డి సాహిత్య చింతామణి, సంగీత చింతామణి, శృంగార దీపిక అను గ్రంథాలను రచించాడు. వసంత రాజీయం గ్రంథాన్ని రచించిన కుమారగిరిరెడ్డికి కర్పూర వసంతరాయలు అనే బిరుదు ఉంది.

రెడ్డి రాజుల మొదటి రాజధాని కొండవీడు

కోటకు వెళ్లేందుకు రెండువైపుల నుంచి నేలమెట్లు ఉన్నాయి. సరాసరి కొండమీదకు వెళ్లేవారి కోసం నిర్మించాల్సిన ఘాట్‌రోడ్డుకు సర్వే పూర్తి కావస్తోంది. కొండమీద మూడు చెరువులున్నాయి. ఒకటి నిండగానే నీరు వృథా కాకుండా, రెండు చెరువులోకి వెళ్లే సౌకర్యం ఉంది. కొండకింద ఉన్న కత్తుల బావి (వేణునాథస్వామి దేవాలయం), శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం, ఆలయం లోపల, బయట గోడల మీద అపరూప శిల్ప సంపదలున్నాయి.

కొండమీద ఉపయోగించుకునే అవకాశం ఉన్న భూమి విస్తీర్ణం అయిదు చదరపు కిలోమీటర్లు.కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 దేవాలయాలు, గుర్రపు శాలలు, ఆయుధశాల, నేటికొట్టు, మసీదు, ఖజానా, వంటి చారిత్ర సంపద ఉంది.ఘాట్‌రోడ్డు కొత్తపాలెం వైపు నుంచి, అయిదో నెంబరు జాతీయ రహదారికి సమీపంలో గల కోట, కొండవీడు గ్రామాల వైపు నుంచి అభివృద్ధి చేసుకుంటూ వస్తూ మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.

కొండవీడు కోటను రాష్ట్ర ప్రభుత్వం రక్షిత కట్టడంగా గుర్తించింది.కొండవీడు కోటను పురావస్తు శాఖ రక్షిత కట్టడంగా జి.ఒ.1535 తేదీ 2-11-1966న నిర్ణయించారు. ఇక్కడో కందకం (అగడ్త)ఉండేది. 37 ఎకరాల విస్తీర్ణం గల ఈకందకానికి చారిత్రక కొండవీటికొండ మీద నుంచి వర్షాకాలంలో నీరు జాలువారుతుంది. కందకంలోకి చేరిన నీటిని కొండవీడు పరిసరాల్లోని ఐదు గ్రామాల భూముల రైతులు సాగునీరుకు వినియోగించు కుంటున్నారు. చాలా కాలంగా సరైన మరమ్మతులు లేకపోవటంతో కందకం అడవి మాదిరిగా తయారైంది.

భూగర్భ జలాల పెరుగుదలకు ఉపయోగపడుతుందని అధికారులు నివేదికలు రూపొందించారు.20 సెంట్ల కందకం ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించి రూపురేఖలు మార్చారు.ఎనిమిది అడుగుల లోతు గల కందకాన్ని పెద్ద పెద్ద బండరాళ్లు, మట్టితో పూడ్చి వేసి చదునుచేశారు. కందకం పరిధిలో ఒకటి రెండు చోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టారు.

. ప్రోలయ వేమారెడ్డి (1323-1350) రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు. వీరి రాజధాని మొదట అద్దంకి. తరువాత కొండవీడు. ప్రోలయవేమారెడ్డి తరువాత అతని తమ్ముడు అనవేమారెడ్డి, అనంతరం కుమారగిరి రాజ్యాన్ని పాలించారు. కుమారగిరి బావమరది కాటయవేముడు రాజమండ్రిలో రెడ్డి రాజ్యాన్ని దాదాపు స్వతంత్రంగా పాలించసాగాడు. కుమారగిరికి సంతానం లేనందున అతని తరువాత అతని పినతాత కొడుకు పెదకోమటివేముడు 1400-1420 మధ్యకాలంలో రాజ్యం చేశాడు. ఈ పెదకోమటి వేముని ఆస్థానకవి శ్రీనాథుడు. మంత్రి సింగనామాత్యుడు. రాజమండ్రిలో కాటయవేముడు, అతని వారసులు కూడా సాహిత్యాభిమానులు. స్వయంగా కవులు.

కొండవీటి రెడ్డి రాజుల పరిపాలనా కాలంలో, వారు నిర్మించిన కోట ఈ గ్రామములో ఒక ఆకర్షణ. కొండపల్లి కోటను కొండవీటి రెడ్డి రాజ్య స్థాపకుడైన ప్రోలయ వేమారెడ్డి 14 వ శతాబ్దంలో నిర్మించినట్లు భావిస్తున్నారు. దీనిలో మూడంతస్తుల రాతి బురుజు ఉంది. ఇక్కడ విరూపాక్ష దేవాలయం ఉంది.

కొండ చుట్టూ శుత్రుదుర్భేద్యమైన ప్రాకారం. రాజమహల్ గోడలపై కళాఖండాలను తీర్చిదిద్దారు. దర్బారు నిర్వహించే రాజమహల్, రాణి, పరివారం నివాసముండే రాణీమహల్, నర్తనశాల, నేటి రైతు బజార్లను తలపించే అంగడి, నేరగాళ్లను ఉంచే కారాగారం, ఆయుధాగారం, ప్రజలు స్నానం చేయడానికి వీలుగా పెద్ద కొలను, రాజ కుటుంబీకుల కోసం మరో కొలను, గుంపులుగా తరలివెళ్లడానికి, ఏనుగులు, గుర్రాలు వెళ్లడానికి వీలుగా రహదారుల నిర్మాణం -ఇవన్నీ ఒక కొండపైనే ఉన్నాయి. కొండపల్లి కోటను ప్రస్తుతము పునర్నిర్మిస్తున్నారు.

క్రీశ1360వ సంవత్సరంలో రెడ్డి రాజైన అనవేమారెడ్డి ఈ కోట నిర్మాణం చేపట్టాడు. రెడ్డి రాజుల అనంతరం గజపతి రాజులు ఇక్కడినుంచి పరిపాలన సాగించారు.తరువాత మహ్మదీయ రాజైన నిజాం ఉల్ ముల్మ్ పాలనలో మంత్రి గవాన్ ఆధ్వర్యంలో ఈ కోటకు క్రీశ 1471లో మరమ్మతులు జరి గాయి. ఆ తరువాత మహ్మద్ షా కాలంలో పురుషోత్తమ గజపతిని ఈ కోటకు అధిపతిని చేశాడు. క్రీశ 1516 సంలో విజయనగర రాజైన శ్రీ కృష్ణదే వరాయులు ఈ కోటను ముట్టడించి తిరిగి గజపతి రాజులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది.

అనంతరం గోల్కొండ ప్రభువైన కులీ కుతుబ్ షా ఈ కోటను ఆక్రమించినట్లు తదుపరి ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో ఈ కోటకు మెరుగులు దిద్ది, ఇతర సౌధాలు నిర్మించాడని చెబుతారు. అందుకే కొండ కింద భాగంలో అతని పేరుపై ఇబ్రహీంపట్నం గ్రామం నిర్మించినట్లు ఆధారాలున్నాయంటారు. ఆ తరువాత మహ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ఈ కోటకు కట్టుదిట్టమైన భద్రత చేపట్టి చెరువులు, బావులు మొదలైనవి తవ్వించి నీటి సదుపాయాలు కల్పించారు. క్రీశ1687 మధ్య కాలంలో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు, తరువాత గోల్కొండ నవాబులు అనంతరం నాజర్ జంగ్ పరిపాలించారు.

వేమన జీవితం గురించిఈ క్రింది కథ ప్రచారంలో ఉంది. 

కొండవీడు పాలించిన కుమారగిరి వేమారెడ్డి కాలంలో ఒక బ్రాహ్మణ యువకుడు భిల్లకన్యను వివాహమాడి అడవిలోని పరుసవేది జలాన్ని సంగ్రహించారు. ఒక కోమటి మిత్రుడు ఆ బ్రాహ్మణునినుండి పరుసవేదిని కుయుక్తితో తీసుకొని ఆ బ్రాహ్మణుని మరణానికి కారకుడయ్యారు. ఇది తెలిసి రాజు కుమారగిరి వేమారెడ్డి కోమటి సంపదను స్వాధీనం చేసుకొన్నారు. కోమటి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆ హత్యాపాతకం పోవడానికి కోమటి వేమారెడ్డి పలు ధర్మకార్యాలు చేయడమే కాకుండా తన పిల్లలకు ఆ బ్రాహ్మడి పేరూ, కోమటి పేరూ పెట్టారు. అలా అతని కొడుకులు పెదకోమటి వెంకారెడ్డి, రాచవేమారెడ్డి, వేమారెడ్డి. ఈ మూడవ కొడుకే వేమన కవి అయ్యారు.

రెడ్డి రాజుల మతవిశ్వాసాలు

రాజు లే మత మవలంభించుచుండిరో జనులలో బహుళ సంఖ్యాకులు కూడా అదే మత మవలంబించుచుండిరి. "రాజానుమతం ధర్మం" అని జనులు విశ్వసించిరి. ఆంధ్రదేశములో కాకతీయుల కాలమందు విజృంభించిన వీరశైవ మింకను ప్రబలముగానే యుండెను. రెడ్డిరాజులు అత్యంత వీరశైవాభినివిష్టులై యుండిరి. శివక్షేత్రముల నుద్ధరించిరి. శ్రీశైలమునకు మెట్లు కట్టించిరి. ప్రతి దినము ఆరుమారులు శివపూజలు చేయుచుండిరి. అనేక యజ్ఞయాగములు చేసిరి. ప్రభువుల ననుసరించి వారి మంత్రులు, సేనానులు శైవమతమునకు వ్యాప్తినిచ్చిరి.

రెడ్లు శైవులయినను పరమతస్థుల నే మాత్రమైనను బాధించినట్లు కానరాదు కాకతీయులు చేసిన పొరపాటును వీరు చేయలేదనవచ్చును. రెడ్డిరాజ్యము తుదికాలములో, వైష్ణవమతము దక్షిణ తమిళమునుండి తెనుగుదేశములోని కెగుమతి కాజొచ్చెను. అయ్యంగార్లు ప్రవేశమై తిరుదీక్ష నియ్య మొదలుపెట్టిరి. 

శైవశక్తి పేరుతో ప్రజ లనేకదేవతలను కొలిచిరి. "కోమలార్ధేందు ధరుకొమ్మ గోగులమ్మ"; "మహిత గుణములతల్లి శ్రీమండతల్లి"; 'నూకాంబ'; 'ఘట్టాంబిక'; 'మానికాదేవి' అను శక్తులు ద్రాక్షారామములో వెలసియుండెను. "కలౌ మైలారు భైరవా" అని మైలారుదేవుడు గీర్వాణసూక్తి కెక్కి యెక్కువగా వ్యాప్తుడయ్యెను. ఏకవీరాదేవిని గూడా జనులు మఱువలేదు. శూద్రజాతులవారు పలు దేవతాశక్తులను గొలిచిరి.

రెడ్డిరాజులకాలమందలి కులములను గూర్చి విచారింతము. రెడ్లు "చతుర్థజాతి" వారై యుండిరి. కాకతీయులు "అత్యర్కేందుకులప్రసూతులు." వీరిని స్పష్టంగా శుద్రులని చెప్పజాలకపోయిరి. అయినను క్షత్రియోచితకర్మలను యజ్ఞయాగాదులను, సోమపానమును వీరు చేసిరి. పైగా క్షత్రియులము అని చెప్పుకొనువారితో నెల్లను బాందవ్యము చేసిరి. చోళులతో, విజయనగర చక్రవర్తులతో, పల్లవులతో, హైహయులతో, ఇతర రాజకులీనులతో బాంధవ్యములు చేసిరి. కాని వెలమలతో కాని, కమ్మలతో కాని బాంధవ్యము చేసినట్లు కానరాదు.

రాచవారు, చోడులు తాము క్షత్రియులమని చెప్పుకొనిరి. క్షత్రియులందరు సూర్యునికో చంద్రునికో పుట్టినవారట! సూర్యచంద్ర మండలాలకు పిల్లలుపుట్టరని మన కీనాడు బాగుగ తెలియును కాన సూర్యచంద్ర వంశాలనునవి కల్ల, బలిష్టులై దేశము నాక్రమించుకొని పాలించిన విజేతలపై పౌరాణికులకు అనుగ్రహము కలిగినపుడెల్లను వారిని చంద్రునికో సూర్యునికో అంటగట్టి క్షత్రియులనుగా జేసిరి. అనార్యులగు హూణహవివ్కకనిష్కాదులు, శకరాజులు, ఇట్టివారెందరో క్షత్రియులైరి.

"చోడులు క్షత్రియులుగదా! వారితో రెడ్లను కలుపుట యెట్లని కొందరకుసంశయము కలుగవచ్చును. కాని, క్షత్రియులమని చెప్పుకొన్న చోడులు ప్రాచీనకాలమునుండి క్షాత్రవృత్తి వహించిన వారగుటచేత నుత్కృష్టమైన రాజపదవులను వహించినప్పుడు ఆ కాలమునాటి బ్రాహ్మణోత్తములు వారిని క్షత్రియులనుగా పరిగణించి యుందురు. కాని యిటీవలి రెడ్డిరాజులు పూర్వపు వర్ణాశ్రమసాంప్రదాయ ధర్మములు చెడిపో యిన తర్వాతికాలమున రాజ్యపదవులను వహించినవారు గావున నవీన బ్రాహ్మణోత్తములు వీరిని క్షత్రియులనుగా పరిగణింపక చతుర్థ వర్ణములో నుత్తములనుగా వర్ణించియుండిరి.

పదునేనవశతాభ్ది ప్రారంభమునందు గూడ కొండవీడు, రాజమహేంద్రవరము పాలించిన రెడ్లకును, రాచవారికిని సంబంధ బాంధవ్యములు కలవని (శివలీలావిలాసము, కొరిమిల్లిశాసనము) పైదృష్టాంతములు వేనోళ్ళ జాటు చున్నవి.

"చతుర్థకులము" క్షత్రియకుల సమమని శ్రీనాథుడు డొంకతిరుగుడుగా భీమేశ్వరపురాణాదిలో వర్ణించుతూ "అందు పద్మనాయకు లన, వెలమలన, కమ్మలన, సరిసర్లన, వంటర్లన, బహు ప్రకారశాఖోపశాఖాభిన్నంబులైన మార్గంబులన్" వెలసిరనెను.

అందు పంటదేసటి అను రెడ్డివంశ మొకటి అని తెలిపినాడు. పై శ్రీనాథ వచనములో నరిసర్లు అన నేజాతియో తెలియదు. వంటర్లు అని ముద్రితపాఠమందు కలదు. వంటరి అన వంటలవాడు. ఇది సరియని తోచదు. బహుశా అది ఒంటరి (ఏకవీరుడు) అయి యుండును. పద్మనాయకులు వేరు, వెలమలు వేరు అని పై వచనాభిప్రాయముగా కానవస్తున్నది. మున్నూరుకులమును గూర్చి కొరవి గోపరాజు తన సింహాసనద్వాత్రింశతి ప్రబంధాదియందు తెలిపినాడు. కాని అది తప్పు; చారిత్రికవిరుద్ధము.

రెడ్డి పదోత్పత్తినిగూర్చి పలువురు విమర్శకులు చర్చలుచేసి తేల్చిన సారాంశమేమనగా క్రీస్తుశకము ఆరేడునూర్లసంవత్సరములనుండి యీశబ్దోత్పత్తి కానవస్తున్నది. పూర్వము వీరు చిన్న భూభాగముల కధికారులై యుండినప్పుడు రట్టగుడ్లు అనబడిరి. రట్ట అన రాజ్యము; గుడి అన గుత్త, అనగా వ్యవసాయనిమిత్తము, గ్రామాలరక్షణ నిమిత్తము భూములను పొందినవారిని యర్థము. రట్టగుడియే క్రమముగా రట్టఉడి, రట్టాడి, రట్టడిగా మారెను. రట్టడిపదములను పండితారాధ్యుడు తన శివతత్త్వసారములో వాడెను. తర్వాతి కవులు గ్రామాధి కారియను నర్థములో, దర్పదౌర్జన్యయుతుడను నర్థములోను వాడిరి. రట్టడిపదమే క్రమముగా రెడ్డియయ్యెను. క్రీ.శ. 1400 ప్రాంతమునుండి రెడ్డిపదము స్థిరపడి పోయెను.  ఇతర జాతులలో అంతశ్శాఖలు ప్రబలినట్లుగా రెడ్లలోను కొన్నిశాఖ లేర్పడెను. అవి విశేషముగా సీమలనుబట్టి యేర్పడెను.

"ప్రౌడదేవరాయకాలంలో వైశ్యులు వైజాతీయులు కులవివాద పరిష్కారమును కోరగా అరాజు కోలాచల మల్లినాథుని మరికొందరి పండితులను ధర్మాసన పరిష్కర్తలనుగా నేర్పాటుచేసెను. అంతకు పూర్వ మొకప్పు డిట్టి వివాదము కలిగియుండ కంచిలో (కాంచీపురములో) అది పరిష్కృతమై శాసనబద్దమై యుండెను. ఆ శాసనమును ధర్మాసనానికి కంచినుండి అదేపనిగా తెప్పించిరి. అందిట్లుండెను. నాగరులు, ఊరుజులు, తృతీయజాయులును వైశ్యులు. వైశ్యునికి శూద్రస్త్రీకిని పుట్టినవారు వై జాతీయులు, వైశ్యులకు స్వాధ్యాయయజనదానాధికారాలు కలవు. వారు వ్యాపారము, సేద్యము, పశువుల పోషణము చేయగల వారు,

వైజాతీయులలో వణిజ, కోమటి, వాణివ్యాపారి, వాణిజ్యవైశ్యులు, ఉత్తరాది వైశ్యులు చేరినట్టివారు. వైశ్యులకే అన్నివస్తువుల వ్యాపారముపై అధికారము కలదు. "కోమటిస్తు ధాన్య విక్రయమాత్రే అధికారోస్తియుక్తం" కోమట్లకు వడ్లవ్యాపారమే పరిమితిగా చేయబడినది. ఇవి కాంచీపురశిలాశాసనస్థ విషయములు. పదవాక్య ప్రమాణస్థానులైన మల్లినాథసూరిగారు సకల శ్రుతిస్మృతిశాస్త్రేతిహాస పురాణ కావ్యకోశాదుల నవలోడించి వైశ్య, ఊరుజ, నాగర, వణిజ, కోమటి,వాణివ్యాపారి, వాణిజ్య, వైశ్యశబ్దాలన్నియు వైశ్యశబ్దవాచకములే! యనియు , కావున వైశ్య వైజాతీయ విభేదాలకు స్వస్తిచెప్పవలసినదే అనియు జయపత్ర మిచ్చిరి." మల్లినాథసూరి ఆ కాలపు వైశ్యసంఘ సంస్కర్తగా నుండెనేమో!

ఇక బ్రాహ్మణులను గూర్చి కొంత తెలిసికొందము. ఒకదిక్కు వీర శైవులు బ్రాహ్మాణాధిక్యమును పడగొట్టుటకై చాలా కృషి చేసిరి. అదేసమయములో బ్రాహ్మణాది సకల హిందూజాతులను అసహ్యించుకొను తురకలు దేశములో జొరబడి కల్లోలము చేసిరి. మరొకదిక్కు వీరశైవుల ప్రతిఘటన పటుత్వమునకై రామానుజీయులును పంచసంస్కారవిధానముచేతను ప్రపన్నత్వ సిద్ధాంతము చేతను కులకట్టుబాట్లను సడలిస్తూయుండిరి. ఇన్ని శక్తు లెదురొడ్డినను బ్రాహ్మణత్వమునకు భంగము కలుగలేదు సరికదా అది మరింత లోతుగా పాతుకొనెను.

కులనిర్మూలన సంస్కరణము లన్నియు బ్రాహ్మాణాధిక్యతకు కట్టుబాటులగుటచే వారు ఆత్మరక్షణము చేసుకొన కూరకుండిరని తలపరాదు అగ్నిమిత్ర పుష్యమిత్రులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు మున్నగువారి బ్రాహ్మణ రాజ్యములు క్రీస్తుశకాదినుండి అరవ శతాబ్ద్యంతము వరకు పలుతావుల విలసిల్లెను. అప్పుడే వృద్ధస్మృతులు, ఉపపురాణాలు సృష్టియై యుండును.

ఇతర పురాణాలు అపారముగా అప్పుడే పెరిగియుండెను. స్మృతులలో హస్తక్షేపము లప్పుడే పడియుండును. అదే విధముగా రెడ్డిరాజుల కాలమందును, కాకతీయుల కాలమందును స్కాందపురాణాలు పెరిగినట్లు పలువురు చరిత్ర పరిశోధకు లభిప్రాయ మిచ్చినారు. ఆనాటి తెనుగు వాఙ్మయ మందును బ్రాహ్మణాధిక్యత విశేషముగా కానవస్తున్నది. ఈ రెడ్డియుగముననే వెలువడిన బోజ రాజీయములో అడుగడుగునకు బ్రాహ్మణప్రభావగర్బిత కథలే బగుళముగా అల్లబడినవి.

ఈ విధమగు ప్రచార మట్లుండ యథార్థముగా బ్రాహ్మణులందే వేదశాస్త్ర విద్యలు కేంద్రీకృతమై యుండెను. షోడశకర్మలకు, వ్రతాలకు, శుభాశుభములకు అన్నింటికిని బ్రాహ్మణుడే యాధార భూతుడు. నిన్న మొన్నటి వరకు కూడా బ్రహ్మణేతరులకు వేదవేదాంగములు చెప్పుటకు సహింపని బ్రాహ్మణు లుండినప్పుడు ఆ కాలమున లేకుండిరా ? అట్టివారుండిన సర్వజ్ఞ సింగడు, సర్వజ్ఞ చక్రవర్తి, కోమటి వేమడు ఎట్లు బిరుదాంచితులైరి ? రాజులు పైనియమాని కపవాదపాత్రులై యుండిరేమో ?

ఎటులైన నేమి శ్రుతిస్మృతి పురాణ శాస్త్రాదుల కంతకును విశేషముగా బ్రాహ్మణులే నిధులై యుండిరి. తెనుగులోనికి పురాణములు పూర్తిగా రానందున ప్రజలకు పురాణశ్రవణము చేయువారు బ్రాహ్మణులే. కావున పురాణముల ద్వారా ప్రచార మత్యంత ముఖ్యమని వారెరిగినవారే ! పలనాటి బాలచంద్రుని తల్లి విప్రుల బిలిపించి భారత రామాయణ పురాణములను వినుమని కుమారునికి బోధించియుండెను.

ఇట్టి విశిష్టతలచేత విప్రులు అప్పటి రాజులకు మంత్రులై, సేనానులై, విద్యాధికారులై, దీక్షాగురువులై, బోధకులై, పురోహితులై తమ యగ్రస్థానమును స్థిరీకరించుకొనిరి. రెడ్ల చరిత్రలో బ్రాహ్మణ భక్తి ఒక అపూర్వ విచిత్రఘట్టము. అది 'నభూతో నభవిష్యతి అని యనిపించు కొన్నది.

వ్యవసాయము - ప్రజలస్థితి

రెడ్డిరాజుల కాలములో దేశమును సీమలనుగా లేక నాడులనుగా విభజించినట్లు కానవచ్చును. ఈ విభజన వారు క్రొత్తగా చేసినట్లు కానరాదు. వారికంటే పూర్వమునుండియే అవి యుండెను. రాజమహేంద్రవరమునకు 11 మైళ్ళ దూరమునున్న కోరుకొండలో రాజ్యముచేసిన ముమ్మడినాయకుని రాజ్యములో కోనసీమ, అంగరసీమ, కొఠామసీమ, కురవాటసీమ చాంగలునాటిసీమ మొదలగు సీమలు చేరియుండెను. ఇవన్నియు గౌతమీనది కిరుప్రక్కల వ్యాపించి యుండెను.

ఈ రాజ్యము అరటి, కొబ్బరి, పనస, పోక, మామిడి మొదలగు తోటలలో రమ్యమై ఆంధ్రభూమిని ప్రసిద్ధిగా నున్నదని యార్యవట శాసనమున వర్ణింపబడినది.1 "శ్రీశైల పూర్వనికటమునుండి పూర్వ సముద్రముదాక ప్రవహించుకుండి తరంగిణి యను గుండ్లకమ్మనది కిరుపక్కలనుండు సీమకే పూంగినాడను నామము కలదని తెలియుచున్నది.

ఇట్టి సీమలు దేశ మంతటను అనంతముగా నుండెను. కాని, రెడ్డిరాజులు తమ పరిపాలన సౌకర్యమునకై తమ రాజ్యమును కొండవీడు, వినుకొండ, బెల్లముకొండ, అద్దంకి, ఉదయగిరి, కోట, నెల్లూరు, మారెళ్ళ, కందుకూరు, పొదిలి, అమ్మనబ్రోలు, చుండి, దూపాడు, నాగార్జునకొండ అని విభాగములు చేసిరి.

పల్లవులు, కాకతీయులు దేశమందలి అడవులను కొట్టించి, గ్రామాలను ప్రతిష్ఠించి, వ్యవసాయకులకు భూము లిచ్చియుండిరి. దీనినిబట్టి క్రీస్తుశకము 1000 కి పూర్వము కర్నూలు, బళ్ళారి మున్నగు మండలాలు అరణ్యప్రాంతాలుగా నుండెనని తెలియును. ప్రతాపరుద్రుడు స్వయముగా కర్నూలు సీమకు వెళ్ళి అడవుల గొట్టించి ఇప్పటికి కర్నూలు పట్టణమునకు 10, 15 మైళ్ళ ఆవరణములోని పల్లెల పెక్కింటిని నిర్మాణము చేసినట్లు ఆకాలపు శాసనాదుల వలన తెలియవచ్చెడివి. తెలంగాణములో నూరేండ్ల క్రిందటకూడ అడవులనుకొట్టి రైతుల ప్రతిష్ఠించుతూ వచ్చిరనిన ఆకాలపుమాట చెప్పనవసరము లేదు.

వ్యాపార పరిశ్రమలు

ప్రాచీనము నుండియు తెనుగువారు సముద్రవ్యాపారమును చేసినవారు. కృష్ణా, గోదావరి, విశాఖపట్టణము జిల్లాలవారికి సముద్రతీరముండుటచేత వారికి సముద్రవ్యాపారమునకే యెక్కువ అవకాశములుండెను. వారు బర్మా, మలయా, ఇండోనీషియా, చీనా, సింహళద్వీపాలతో విశేషముగా వ్యాపారము చేసిరి. పై దేశములనుండియు పర్షియా, అరేబియా దేశాలనుండియు నానావిధములగు సరుకులు తెనుగు తూర్పు తీరమందలి రేవులలో దిగుతుండెను. నేలబేరానికి దొంగలు తగిలినట్లుగా సముద్రవ్యాపారానికి దొంగలుండిరి.

అందుచేత రాజులు వారి నణుచుటకై ప్రయత్నాలు చేస్తూవుండిరి. కాకతీయ గణపతి చక్రవర్తి కాలానికి ముందును, కాకతీయ రాజ్యపతనానంతరము దేశము తురకల వశమైనప్పుడును సముద్ర వ్యాపారము స్తంబించియుండెను. వేమారెడ్డి తమ్ముడు మల్లారెడ్డి పేరుపొందిన శూరసేనాని.

సముద్ర వ్యాపారమువల్ల రెడ్డి రాజులకు చాలా గొప్ప లాభముండెను. అంతకు ముందటి అరాచక స్థితుల వలన మోటుపల్లి వర్తక మాగియుండెను. రెడ్డి రాజులు శాంతిని నెలకొలిపి, సుంకరివారు వర్తకులదోపిడి చేయకుండ సరకులపై సుంకములు నిర్ణయించి, కొన్నింటిపై తగ్గించి, కొన్నింటిపై తీసివేసి, అందరికినీ తెలియుటకై మోటుపల్లి తీరములో శాసనము వ్రాయించి యుంచిరి. అప్పటి భాష, అప్పటి వ్యాపారము తెలియజేయి నాశాసనము నిందుదాహరింతురు.

కళలు

రెడ్డిరాజుల కాలములో సంస్కృతాంధ్ర పండితు లనేకు లుండిరి. అందు కొందరికృతులే మనకు లభ్యమైనవి. మన దురదృష్టమేమో 500 ఏండ్లలోనే శ్రీనాథుని బహుకృతులు, శంభుదాసుని రామాయణము, కుమారగిరి వసంతరాజీయము, ఇట్టి ముఖ్యమైనవి జాడలేకుండా పోయెను. బాలసరస్వతి అనునతడు అనపోతరెడ్డి యాస్థానకవియనియు, త్రిలోచనాచార్యుడనునతడు అనవేముని ఆస్థానకవియనియు మాత్రమే మనకు తెలియవచ్చినది. పలువురి కవితలు శాసనాలలో మాత్రమే మిగిలిపోయినవి. ప్రకాశ భారతయోగి అనునతడు చక్కని శాసనశ్లోకాలు వ్రాసెనని మాత్రమే మనమెరుగుదుము. వెన్నెలకంటి సూర కవితో పాటు మహాదేవకవి యుండెనన్నంతవరకే యెరిగితిమి.

అనపర్తి శాసనమందే అన్నయకవి పద్యాలు చక్కని కవితాపాకముగలవి మనమెరుంగుదుము. కాటయవేముని శాసనము కవితలో వ్రాసిన శ్రీవల్లభుడను నతని చరిత్ర మన మెరుగము. ఇంకెందరి విజ్ఞానసంపదను మనము కోలుపోయినామో యేమో ? రెడ్ల యాశ్రయములో ఎర్రాప్రెగడ, శ్రీనాథుడు, వెన్నెలకంటి సూరన, నిశ్శంక కొమ్మన అను ప్రసిద్ధకవులుండిరి. వామనుభట్ట బాణుడను సంస్కృతకవి వేమభూపాల చరిత్రమును సంస్కృతములో వ్రాసెను. రెడ్డిరాజులు స్వయముగా గీర్వాణములో వ్యాఖ్యలు, కవితలువ్రాసిరి.

కుమారగిరిరెడ్డి వసంతరాజీయమను నాట్యశాస్త్రమును వ్రాసెను. పెద కోమటియు నొక నాట్యశాస్త్రమును రచించెనందురు. కాటయ వేమన కాళిదాస నాటకములకు వ్యాఖ్యలు వ్రాసెను. పెదకోమటి సాహిత్య చింతామణిని వ్రాసెను. ఈ రాజు విశ్వేశ్వరకవి యనునతని కగ్రహారము దానముచేసెను. అతడేమివ్రాసినో మనకు లభ్యము కాలేదు.

కొండవీటి రాజమహేంద్రవర రాజుల వలెనే రాచకొండ వెలమరాజులును కవులై, పండితులై, రచయితలై, కవి పండిత గాయక పోషకులై ప్రఖ్యాతిలైరి, అయితే రెడ్డి వెలమ ప్రభువులలో కొందరు స్వయముగా రచనలు చేయలేదని ఒకరిద్దరు విమర్శకు లన్నారు. అది కొంతవరకు నిజమైనను ఆరాజుల విజ్ఞతకు, కొట్టు కలుగనేరదు. రాచకొండ రాజుల వద్ద మల్లినాథుసూరి ముఖ్య పండితుడై యుండెను.

రెడ్ల యాస్థానాని కాంధ్రపండితులేకాక, ఇతర భారతీయ ప్రాంతాలనుండి అనేక పండితులు, కవులు, కళావేత్తలు కొల్లలుగా వెళ్ళుతూవుండిరి. అట్టివారిని పరీక్షించి వారి యర్హతలను ప్రభువులను మనవి చేయుటకు శ్రీనాథ కవిసార్వభౌముడు నియుక్తుడై యుండెను. రెడ్లశాసనములలో కొన్నింటిని ఆతడే వ్రాసి ఫిరంగిపుర శాసనములలో "విద్యాధికారీ శ్రీనాధో అకరోత్" అని వ్రాసుకొనెను.

ప్రజా జీవనము

ఆ కాలపు ప్రజల వేషాదికము లెట్టివో, ఆచార లెట్టివో, జీవితవిధానము లెటువంటివో, విశ్వాసము లెటువంటివో కనుగొందము. సాధారణముగా జనులు ధోవతి కట్టువారు. శూద్రజాతిలో రాయలసీమ తెలంగాణములందు చల్లాడములు తొడుగుతూ వుండిరి.

దుప్పటియు గుండు రుమాలయు సాధారణవేషాలు. కొందరు చుంగుల లపేటా రుమాలల కట్టిరి. పలువురు నడుములో బెత్తెడు వెడల్పున ఏడెనిమిది మూరల పొడవునుకల కాసె (దట్టిని) బిగిస్తూవుండిరి. వారికి అంగీలు లేవనికాదు. వాటివాడుక తక్కువ. అంగీలు నిడుపై బొందెలు కలవై యుండెను. కవుల వర్ణనలలో కొందరి వేషాలెట్టివో తెలియవచ్చెడివి.

కామేశ్వరీ కథే కామవల్లీ కథ

 కామేశ్వరి కథే క్రమానుగతంగా కామవల్లి కథగా పరిమాణం చెందింది. దీనిని మోటతోలేవారు, కలుపుతీసేవారు, కోతలు కోసేవారు, వడ్లు దంచేవారు, తిరుగళ్ళమీద పిండి విసిరే వారూ ఎక్కువగా పాడుకునేవారు. ఆ విధంగా వారు కాలాన్ని వెళ్ళబుచ్చుతూ, కష్టాన్ని, అలసటనీ మరచిపోయి ఆనందంగానూ, ఆహ్లాదంగాను ఆయా పనులు పూర్తి చేసుకునేవారు.

గొండ్లియాడే కుండలాకార నృత్యం

పూర్వంనుంచీ కవిత్వంలోను, సంగీతంలోను, దేశి విధానం, మార్గ విధానం అనే రెండు భిన్న రీతులు ఏర్పడి వున్నట్లు తెలుసుకున్నాం. అందులో డదేశి నృత్యాలే ప్రజలకు ఆతి సన్నిహితంగా వ్యాప్తిలోకి వచ్చాయి. పురుషులు కోలాటం వేస్తూ, చిరతలు మ్రోగిస్తూ, చిందులు త్రొక్కుతూ నోటితో పాటలు పాడేవారు.

అలాగే స్త్రీలు వలయాకారంగా చప్పట్లు చరుస్తూ బతుకమ్మ పాటలు పాడేవారు. ఈ బతుకమ్మ పాటలు ఆనాడే, తెలంగాణాలో విశేష ప్రచారంలో వున్నాఅదే విధంగా రాయలసీమలో బొడ్డెమ్మ కథ ప్రచారంలో వుండేది. గొండ్లి అనే కుండలాకార నృత్యం ద్వారా బతకమ్మ, బొడ్డెమ్మ పాటల్ని తెలంగాణాలో వున్న మైలార దేవుని పూజల సమయంలో పాడుతూ ప్రజ్ఞలను తెలియజేసేవాళ్ళు. 

కుమారగిరి రెడ్డే కర్పూర వసంతరాయలు

రెడ్డిరాజులలో చివరిరాజు కుమార గిరి రెడ్డి. ఈయన క్రీ.శ. 1386–1402 వరకూ - కొండవీడు రాజధానిగా - ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రసిక ప్రభువు. ఈయనను ధర్మ వేముడని పిలిచేవారు. ఈయన కవుల కవిత్వాన్ని మెచ్చి అనేక పారితోషికాలు బహూకరించేవారు. కుమారగిరికి వసంత రాయలని, కర్పూర వసంత రాయలని రెండు బిరుదులుండేవె. కుమార గిరి స్వయంగా పండితుడు,, సంగీత నాట్య శాస్త్రాల్లో ప్రవీణుడు. వసంత రాజీయం అనే నాట్య శాస్త్ర గ్రంథం వ్రాసినట్లు కూడా కాటమ వేమారెడ్డి రచించిన శాకుంతల వాఖ్యవల్ల తెలుస్తూ వుంది.

మునీనాం భరతాదీనా భోజాదీనాంచ భూభూజాం
శాస్త్రాణి సమ్య గాలోచ్య నాట్య వేదార్థవేవినా
ప్రోక్తం వసంత అరాజే కుమారగిరి భూభూజా
నామ్నా వసంతరాజీయ నాట్యశాస్త్రం యదుత్తమం.

ఈ వసంత రాజీయం మనకు ఇంతవరకూ లభించలేదు. ఈ యన ప్రతి సంవత్సరం వసంతోత్సవాలు జరిపిస్తూ వుండేవాడు.

వాసిగాంచిన వసంతోత్సవాలు

విజయనగర సామ్రాజ్యం లో, కృష్ణదేవరాయల కాలంలో, రాజధానిలో మహార్నవమి రోజున వసంత మండపంలో వసంతోత్సవాలు ఎంతటి మహా వైభవంతో జరిగేవో అలాగే వేమారెడ్డి ఆస్థానంలో కూడా జరిగేవి. ఈ సమయంలో రాజ్యం నాలుగు ప్రక్కలనుంచీ కవుల్నీ, గాయకుల్నీ, వాద్యకారుల్నీ ఆహ్వానించి, మహా వైభవంగా వసంతోత్సవం ముగించే వారు. అందుకే ఆయనకు వసంతరాయ, కర్పూర వసంతరాయలని బిరుదు లీయబడ్డాయి.

ప్రతిభకు పట్టాభిషేకం, పలు దానాలు

సంగీత సాహిత్యాలతో వినోదించే వేమారెడ్డి ప్రతిభావంతులైన కళాకారులందర్నీ తగు విధంగా సన్మానిచాడు.

  1. సంగీత సాహిత్యాల్లోనూ, భరత నాట్య శాస్త్రంలోనూ ప్రావీణ్యం కలిగిన కంచి, పొన్న, పేరి మొదలైన వారిని సన్మానిచిందే కాక పేరి అనే నర్తకికి గుంటూరు జిల్లాలో వున్న పేరుకలపూడి అనే గ్రామాన్నే దానంగా ఇచ్చాడు.
  2. అలాగె క్కంచి అనే దేవదాసిక నాట్యగత్తెకు, కంచికచర్ల అనే గ్రామాన్ని బహూకరింఛాడు.
  3. పొన్ని అనే కళాకారిణికి పొన్నవరం అనే గ్రామాన్నిచ్చి, జీవిత పర్యంతమే కాక వంశపారంపర్యంగా అనుభవించడానికి హక్కు కలిగించాడు.

ఆయన చేసిన దాన ధర్మాలను గురించీ, ఆయన విద్యాభిలాషను గూర్చి, కళాపోషణ గూర్చీ స్థానికంగా వున్న కొండ వీటి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించి వుంచిన కోన వెంకటరాయశర్మ గారు 'భారతీ' పత్రికలో వుదాహరించారు. అంతేగాక శాలివాహన శకం 1300 నాటి వానపల్లి శాసనంలో కూడా ఆయన సంస్థానంలో నిరంతరం జరిగే కార్యక్రమ ప్రణాళికలన్నీ లిఖించబడి ఉన్నాయి.

ఈ విధంగా ఆయన కొండవీటి రాజ్యాన్ని బహుపరాక్రమం తోను, సకల కళా విశిష్టతలతోను పరిపాలించాడు. ఆయన అనంతరం ప్రోలయ దేవుని తమ్ముని కొడుకు పెదకోమటి వేమారెడ్డి రాజ్యానికి వచ్చాడు. ఈ యన విద్వత్తుకు మెచ్చి ఈ యనకు సర్వజ్ఞ చక్రవర్తి అనే బిరుదు కూడా ప్రసాదించ బడింది.

వేమారెడ్డి రచనలు 

ఈయన శృంగార దీపిక, అమరుక శతక వ్యాఖ్య వ్రాసి దక్షిణ హిందూదేశ మంతటా ప్రఖ్యాతి పొందాడు. కుమారస్వామి, సాహిత్య చింతామణి అనే అలంకార శాస్త్రాన్ని రచించి ప్రఖ్యాతి వహించాడు. అంతేగాక సంగీత చింతామణి,. వీర నారాయణ చరిత్ర, శృంగార భూషణం, రఘునాథాభ్యుదయం, వేమాభూపాల చరిత్ర, శబ్దరత్నాకరం, మొదలైన అనేఅ గ్రంథాలను కూడా రచించారు.

ఈ విధంగా కోమటి వేమన క్రీ.శ. 1420 వరకూ పరిపాలించాడు. రాజ్యంలో శాంతి భద్రతల్ని నెలకొల్పిన కాటయ వేముని బావమరిది అయిన కుమారి గిరి రెడ్డి పరిపాలనా బాధ్యతల్నీ కాటయవేమనకు అప్పచెప్పి తాను మాత్రం వసంతోత్సవాల తోను, కవులతోనూ, కళాకారులతోను, నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా కొండ వీటి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు.

కుమారగిరి రత్న సింహాసనాద్యక్ష,, జగద గోపాలరాయ, వేశ్యాభుజంగ, వల్లవాదిత్య, త్రిలింగాధీశ్వర, జంభూద్వీపేశ్వర బిరుదాంకితుడు. ఈ యన బాపట్ల భావనారాయణస్వామి దేవ దాసియైన పల్లెమకు బుట్టిన లకుమా దేవి ప్రయుడు. ఆయనవద్ద సేనానిగా వున్న దొరవరెడ్డి సేనాని లకుమాదేవిని కుమారగిరికి కానుకగా అర్పించాడు.

ఆపరనాట్య సరస్వతి లకుమాదేవి

లకుమాదేవి కుమార గిరి ప్రేయసి, అందాలరాణి, చక్కదనాల చుక్క, అపర నాట్య సరస్వతి, కుమారగిరి ఆస్థానంలో కవి, గాయక, శిల్పి., సామంతాదిమహాజనుల సమక్షంలో తన అభినయచాతుర్యంతో, అందచందాలతో అందర్నీ ముగ్దుల్ని చేస్తూ, ఆస్థానానికి ఒక నూతన శోభను చేకూరుస్తూ వుండేది. అనేక మంది పేద సాదలకు ధనాన్ని, వస్త్రాలను దానం చేస్తూ వుండేది. అందుకే కాటయ వేమన తన శాకుంతల వ్యాఖ్యానంలో ఈ విధంగా వుదాహరించాడు.

జయతి మహిమాలోకాతీత: కుమారగిరిప్రభో
స్సదపి లకుమాదేవీ యన్య ప్రియానదృ శీప్రియా
నవ మభినయం నాట్యార్థానాం తవోతి సహస్త్రధా
వితరతి బహూనర్థా వర్థి వ్రజాయ సహస్రశ:

అని వ్యాఖ్యానించాడు. లకుమాదేవి రాజనర్తకియే కాక, కొమరగిరికి ప్రియాసదృస ప్రియమట. లకుమను గూర్చి ఇంతకు మించిన ఆధారాలు చరిత్రలో లేవని కీ.శే. శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు బహు పరిశోధన చేసి ఇంగ్లీషులో 'హిస్టరి ఆఫ్ రెడ్డి కింగ్డం అనే రెడ్డి రాజుల యుగాన్ని చిత్రించిన మహా గ్రంథంలో వ్రాశారు. ఆనాడు ద్రాక్షారామ భీమేశ్వరుని అఖండ దీపాన్ని వెలిగించడం ఎంతో పుణ్య కార్యంగా ఎంచబడేది. కారణంచేతనే లకుమాదేవి క్రీ.. 1402 లో తన తల్లి దండ్రులకు పుణ్యావ్యాప్తి కోసం అఖండ దీపాదానం చేసి విఖ్యాతి పొందింది.

కుమారగిరి లకుమల వసంతోత్సవ విహారాలు

కుమార గిరీ, లకుమాదేవీ వసంతోత్సవంలో అతి మనోహరంగా విహరిస్తూ వుండేవారట. లకుమ తన నృత్య ప్రదర్శనాలతో, అంగసౌష్ఠ్వంతో, వయ్యారపు నడకలతో, వివిధ నాట్య భంగిమలతో అజంతా సుందరిలా కుమార గిరిని ప్రేక్షకులను ముద్తుల్ని చేసేదట. కుమారగిరి తన భార్యలతో పాటు లకుమాదేవి తోనూ, తదితర అంత: పుర స్త్రీలతోనూ జలక్రీడలు ఆడుతూ వుండే వాడు.

ఈ క్రీడలన్నీ గృహరాజ సౌధంలో జరిగేవి. కుమారగిరి లకుమల ఆనంద భావనం కూడ ఇదే. కొడవీటిలో ఒక దిబ్బ గృహరాజదిబ్బ అనే పేరుతో కుమారగిరి లకుమల చిహ్నంగా వెలుగొందుతూ వుంది. ఆనందకేళీ విలాసాలతో ఆ ప్రేయసీ ప్రియులు ఇరువురూ ఏకకాలంలో అనంత కాలగర్బంలో కలిసిపోయారు. ఈ విధంగా కొండవీటి సామ్రాజ్యంలో నాట్యకళా సరస్వతి దేదీప్య మానంగా వెలుగొందింది.

ఇంచు మించు రెడ్డి రాజన్యులందరూ కూడ గొప్ప విద్వాంసులు. సకల కళావల్లభులు , పండిత పోషకులు, వారిలో గొందరు సంగీత సాహిత్యాలలో అపారమైన ప్రజ్ఞ కల వారు. రాజమహేంద్ర వరాన్ని ఏలిన అల్లయ వీరభద్రారెడ్డి సంగీత, సాహిత్య విద్యలతో సర్వజ్ఞతను సంపాదించుకున్నారు . శివలింగారెడ్డి నాట్య శాస్త్ర పారంగతుడు. మల్లారెడ్డి పౌత్రుడైన శ్రీగిరి రెడ్డి గొప్ప కళా విమర్శకుడే కాక సంగీత సాహిత్యాలలో ప్రవీణుడు.

సర్వేజనా సుఖినోభవంతు