బోర్డు తిప్పిన 4 ఐటీ కంపెనీలు:రోడ్డునపడ్డ 250 మంది ఉద్యోగులు

అదో ఐటీ కంపెనీ. తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్‌ కంపెనీలను ప్రోత్సహించడంతో పుట్టుకొచ్చిన కంపెనీ. మూడు నెలల క్రితమే ప్రారంభమైంది. ఏమైందో ఏమో ఉన్నట్టుండి బోర్డు తిప్పేసింది. యథావిధిగా విధులకు వచ్చిన ఉద్యోగులు,కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో అవాక్కయ్యారు. యాజమాన్యానికి ఫోన్‌ చేయగా,వారం రోజులు ఆగండి. ప్రస్తుతం ప్రాజెక్టులు లేవు, అని సమాధానం వచ్చింది. అలా వారాలు గడిచినా కంపెనీ మాత్రం తెరుచుకోలేదు. ఇంతకూ, వారికి ఆ కొలువు ఊరికే రాలేదు.

ఒక్కొక్కరు అక్షరాల రెండు లక్షల రూపాయలు సమర్పించుకున్నారు. ఒక్కసారిగా కంపెనీ బోర్డు తిప్పేయడంతో మోసపోయామని గ్రహించిన ఉద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్‌కే తలమానికమైన ఐటీ కారిడార్‌లో ఇలా వారం రోజుల వ్యవధిలో మొత్తం నాలుగు స్టార్టప్‌ కంపెనీలు బోర్డులు తిప్పేశాయి. ఫలితంగా 250 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు.

కంపెనీ పేరు అవెన్యూ ఐటీ. గచ్చిబౌలిలో బహుళ అంతస్తుల భవనంలో కార్యాలయం. మూడు దశల్లో ఇంటర్వ్యూ. కొలువుకు ఎంపికైతే ఏడాదికి రూ.3 లక్షల ప్యాకేజీ. ఏ మాత్రం ఆలోచించకుండా నిరుద్యోగులు ఆ కంపెనీ వైపు ఆకర్షితులయ్యారు. ఇదే అదనుగా కన్సల్టెన్సీల ద్వారా వచ్చేవారు రూ. 2 లక్షలు.. నేరుగా కంపెనీ నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారు రూ.1.5 లక్షలు చెల్లించాలని కంపెనీ షరతు విధించింది. దాంతో 120 మంది వరకు కంపెనీ ఖాతాలో డబ్బు జమచేశారు. రెండు నెలలు ట్రైనింగ్‌తో వెల్లదీసిన కంపెనీ, మొదట్లో నెలకు రూ.10 వేలు ఇచ్చి సరిపెట్టింది.

వారం రోజుల క్రితం ఒక లీగల్‌ అడ్వజర్‌ను తీసువచ్చి.. ‘‘కొన్ని కారణాల వల్ల కంపెనీ మూతపడింది. మీరు వేరే ఉద్యోగం చూసుకోండి. పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నా ఫర్వాలేదు. న్యాయపరంగా మేం చేసింది సబబే’’ అని చెప్పించింది. ఇలా అయితే ఎలా అని ప్రశ్నించిన కొందరు ఉద్యోగులను కొంత ముట్టజెప్పి వారి నోరు మూయించింది. దాంతో 120 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. బాధితులు మాదాపూర్‌ ఠాణాలో, ఫిర్యాదు చేశారు. ఈ పోలీ్‌సస్టేషన్‌లో ఇలాంటి మరో రెండు కేసులు నమోదైనట్లు సమాచారం.

రాయదుర్గంలోని మరో కంపెనీని కూడా ఇలాగే మూసేయడంతో 40 మంది ఉద్యోగాలు కోల్పోయారు. కన్సల్టెన్సీల ద్వారా ఈ మోసానికి పాల్పడుతున్నట్లుగా తేలింది. ఇలాంటి కంపెనీల చేతుల్లో మోసపోతున్న వారిలో అత్యధికంగా బీటెక్‌ విద్యార్థులు ఉండటం గమనార్హం.

******************************    REDDY JAGRUTHI NEWS UPDATES ******************************

రెడ్డి విద్యార్ధుల కు, నిరుద్యోగ యువతకు రెడ్డి జాగృతి మనవి

-  రెడ్డి విద్యార్ధులు చాలా మంది ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని, సాఫ్ట్ వేర్ ఉద్యోగాల వేటలో మోసపూరతమైన సాఫ్ట్ వేర్ ట్రైనింగ్ సెంటర్లు, జాబ్ కన్సల్టెన్సీ ల మాటలు నమ్మి లక్షల రూపాయలు వారికి చెల్లించి, బోగస్ కంపెనీలలో ఉద్యోగంలో చేరి, మోసపోయి రోడ్డు మీద పడుతున్నారు. 

- ఈ మద్య హైదరాబాద్ లో 4 సాఫ్ట్ వేర్ కంపెనీలు బోర్డ్ తిప్పేసి, 250 మంది ఉద్యోగులను రోడ్డుమీద పడేసారు. ఈ పరిణామంతో 70 మంది రెడ్డి ఉద్యోగులు న్యాయము కోసం మా దృష్టికి తీసుకువచ్చారు.

దయచేసి, మోసపూరిత సాఫ్ట్ వేర్ కంపెనీల ప్రకటనలు నమ్మకండి.

-   త్వరలో రెడ్డి హెల్ప్ లైన్ , రెడ్డి జాగృతి , RedXn  సౌజన్యంతో రెడ్డి అకాడమీ ఆఫ్ ఎక్స్ లెన్సీ ఆధ్వర్యం లో ఈ సమస్యకు శాశ్విత పరిష్కార మార్గాలు చర్చించి, పరిష్కారాన్ని చూపబోతున్నాము.

-  ఈ కార్యక్రమం గురించి పూర్తి వివరాలను అతి త్వరలో మీకు తెలిజేస్తాము. 

టీం రెడ్డి జాగృతి, 
టీం రెడ్డి హెల్ప్ లైన్ & RedXn